సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమధుర స్మృతులు..

06 సెప్టెంబర్, 2026

alaparhty vari geyam bomma.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 07:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎన్నో.. ఎన్నెన్నో మరి

అన్నీ మధుర స్మృతులే!

ఏవో.. ఏవేవో అవి

ఎదను మెదలు సంగతులే!!

​

ఐదు నెలల పసిపాపా

అతి మృదువుగ తాను నవ్వె!

పెదవుల చిందినా నవ్వు

వెలుగులు నా మదిని రువ్వె!!

​

గిలక్కాయ పట్టుకొనీ

కిలకిల నవ్వింది పాప!

పొర్లుతు దొర్లుతు తృటిలో

బోర్లా పడ్డాది పాప!!

​

పాకుతు దేకుతు వచ్చీ

పాలను తాగింది పాప!

మొదటి మాటగానె పాప

పెదవులు పలికాయి ‘అమ్మ’!!

​

తడబడు అడుగులు వేస్తూ

నడకలు నేర్చింది పాప!

గోడ పట్టుకొని నడచెను

ఏడాదీ రాకముందె!!

​

‘‘బాలబంధు’’ అలపర్తి వెంకటసుబ్బారావు

(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)

94408 05001.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్