మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మిత్రునికి లేఖ

55 నిమిషాల క్రితం

katha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

‘ప్రియమైన స్నేహితుడు పార్ధు,

నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు క్షేమంగా ఉన్నావా! నేను వేసవికాలం సెలవులకు అరకు వెళ్లాను. మా ప్రయాణం కారులో చాలా బాగా సాగింది. దారిలో టీ ఆకుల చెట్లను చూశాను. కారులో వెళ్తుంటే టీ ఆకుల సువాసన భలే వచ్చింది. మధ్యలో జలపాతానికి వెళ్ళి కాసేపు ఆడుకున్నాను. ఆ నీటి శబ్దం చాలా ప్రశాంతంగా ఉంది. కాసేపటికి మేము అరకు బుర్ర గుహలకు వెళ్ళాము. ఆ ప్రదేశం నాకు బాగా నచ్చింది. అక్కడ ఫొటోలు దిగాము. కాసేపటికి ఆకలేసింది. అక్కడే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు టీ షాపు దగ్గర టీ తాగి బయల్దేరాము. నాకు అయితే ఇంకొన్ని రోజులు అరకులో ఉండాలి అనిపించింది. ఈ ప్రయాణం నాకు బాగా నచ్చింది. నువ్వు కూడా ఇలా నువ్వు వెళ్ళిన ప్రదేశం విశేషాలను ఉత్తరం రూపంలో నాకు పంపుతావా?


ఇట్లు,

నీ మిత్రుడు

- M.శ్రీతన్, ఐదవ తరగతి,

అరవింద మోడల్ స్కూలు,

మంగళగిరి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్