మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముద్దు ముచ్చట

26 జులై, 2026

ALAPARHTY
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 07:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎవరన్నారివి నవ్వులని?

ఎదలో మెదిలే మువ్వలివి!

ఎవరన్నారివి దరువులని?

నవరాగం ఆదరువులివి!!

ప్రతిదానిని బహు శ్రద్ధగా

పరిశీలించును ఆసక్తి!


ఆఆ అంటూ మధురముగ

ఆలపించునూ అనురక్తి!


మాటిమాటికీ ‘తాత’యని

మనసును దోచును పెనుయుక్తి!


గడిపిన తనతో కాసేపు

కష్టాల బ్రతుకుకు విముక్తి!


ముదముగ ‘రిషిక’ను ఎత్తుకొని

ఎదపై ప్రేమగ హత్తుకొని

ముద్దులు పెడుతూ వుంటారు

ముచ్చట పెడుతూ వుంటారు!!


(మా ముదిమనుమరాలు ‘రిషిక’ను గురించి)

- ‘బాలబంధు’ అలపర్తి వెంకటసుబ్బారావు

(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)

9440805001.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్