మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionషరతులు అమలుకానంత వరకూ హర్మూజ్‌ మూసివేతే : ఇరాన్

1 గంట క్రితం

Speaker Mohammad Bagher Ghalibaf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 12:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : అమెరికాతో మధ్యంతర ఒప్పందంలోని షరతులను నెరవేర్చే వరకు హర్మూజ్‌ జలసంధిని తెరవబోమని ఇరాన్ స్పష్టం చేసింది. సముద్ర దిగ్బంధనం ఎత్తివేయడం, ఆంక్షలు రద్దు, స్తంభింపజేసిన తమ ఆస్తుల విడుదల వంటి షరతులను అమెరికా అమల్జేయనంత వరకు జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ గలీబాఫ్ మంగళవారం పేర్కొన్నారు. దిగ్బంధనం ఎత్తివేత, చమురు ఆంక్షల తొలగింపు, సైనిక చర్యలను నిలిపివేయడం వంటి ఇతర షరతులను కూడా అమెరికా అమలు చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో హర్మూజ్‌ జలసంధిని ‘‘ కొత్త అమెరికా భూభాగం’’ గా చూపిస్తూ ఒక మ్యాప్‌ను పోస్ట్ చేశారు. ఇరాన్‌ను ఓడించిన తర్వాత హర్మూజ్‌‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తామంటూ ట్రంప్ పదే పదే చెబుతున్నారు. అలాగే, ఇరాన్‌‌తో ఎటువంటి చర్చులు లేవని ట్రంప్‌ ‌మంగళవారం ప్రకటించారు. అంతేకుకుండా ఇరాన్‌‌పై మరింత కఠినంగా దిగ్బంధనం కొనసాగుతుందని వెల్లడించారు. అయితే, సోమవారం నాడు ఇరాన్‌ ‌ఐఆర్‌‌జిఎస్‌‌తో రహస్య చర్చలు జరుపుతున్నామని తెలిపి అంతలోనే ట్రంప్‌ ‌మాటమార్చడం గమనార్హం. దీనికి ఇరాన్ ఘాటుగా స్పందించింది. జలసంధి ఎప్పటికీ ఇరానియన్‌గానే ఉంటుందని తేల్చిచెప్పింది. మరోవైపు, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ సోమవారం ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ, ఇరాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు చర్చలు కొనసాగించాలని కోరారు. శాంతి ప్రయత్నాలకు తాము మద్దతిస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున హర్మూజ్‌ జలసంధి గుండా బయటకు వెళ్తున్న ఒక నౌకపై గుర్తు తెలియని క్షిపణి దాడి చేసిందని బ్రిటిష్ సైన్యానికి చెందిన యుకె మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యుకెఎంటిఒ) కేంద్రం వెల్లడించింది. ఈ దాడిలో ఒక నావికుడు మృతి చెందగా, మిగిలిన సిబ్బందిని ఒమన్ కోస్ట్‌గార్డ్ రక్షించారని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్