అమ్మ ఒడిలా ఆప్యాయమైనది
నా భారతమాత భూమి...
మువ్వన్నెల జెండా రెపరెపలలో
మన గర్వం చిరునవ్వై మెరిసింది...
ఎన్నో త్యాగాల ఫలితమే
ఈ స్వేచ్ఛ అనే వరం...
భగత్‌సింగ్ ధైర్యం,
అల్లూరి వీరత్వం,
గాంధీజీ అహింసా మార్గం,
మనకు ఎప్పటికీ ఆదర్శం...
చదువుకుని మంచి పౌరులమై,
దేశానికి సేవ చేస్తామని
ఈ రోజు ప్రమాణం చేద్దాం...
చెట్టు నాటుదాం...
ప్రకృతిని కాపాడుదాం...
పరిశుభ్రత పాటిద్దాం...
భారతమాత కీర్తిని పెంచుదాం...
జై జవాన్... జై కిసాన్...
మలిశెట్టి సాయి ప్రణవి
6వ తరగతి,
కుమార్ సిబిఎస్‌ఇ స్కూలు,
నూజివీడు,
ఏలూరుజిల్లా.








కామెంట్‌లు (0)