పేదవాళ్లు ఇంకా పేదలుగానే
మిగిలిపోతున్నారు
డబ్బున్న వారు
మరింత ధనవంతులుగా మారుతున్నారు
పేదోడు పొద్దున్నే లేచి పనిచేస్తాడు
పూట గడవాలని శ్రమపడతాడు
చెమట చిందించి అన్నం సంపాదిస్తాడు
అయినా పేదగానే మిగిలిపోతాడు
శ్రమదోపిడీతో ధనవంతుడు మరింత ధనవంతుడవుతాడు
పేదవాడు మాత్రం అప్పుల్లో మునిగిపోతాడు
ఎందుకిలా జరుగుతోంది
ఎందుకు సమానత్వం ఉండటం లేదు
సమాన హక్కులు అందరికీ కావాలి
ధనవంతులు శ్రమజీవుల శ్రమను దోచుకోవటం ఆపాలి
పేదల జీవితంలో వెలుగు రావాలి
పేద వారైనా సరే ప్రతి బిడ్డా చదవాలి
ఇన్‌షేరా మరూఫ్
7వ తరగతి
హార్వెస్టు పబ్లిక్ స్కూల్, ఖమ్మంజిల్లా.







కామెంట్‌లు (0)