మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెసరట్టు

16 ఆగస్టు, 2026

pesarattu balageyam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 08:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బడి నుంచి వచ్చాను

చక్కగా స్నానం చేశాను

ఉతికిన బట్టలు కట్టాను

అమ్మా ఆకలి అన్నాను

అమ్మ పెసలు రుబ్బింది

పెనంపై గుండ్రంగా వేసింది

అల్లం జీలకర్ర చల్లింది

పచ్చిమిరపను కలిపింది

నూనెతో బాగా కాల్చింది

ప్లేటులో పెట్టి ఇచ్చింది

అవురావురని తిన్నాను

ఇంకొక అట్టు అడిగాను

ఆరోగ్యానికి మంచిదని

అమ్మ చెప్పగా విన్నాను

పెసరట్టమ్మా పెసరట్టు

రుచికరమైన పెసరట్టు

ఉల్లి వేసిన పెసరట్టు

ఉప్మా తోడు పెసరట్టు

ఒకటి రెండుతో సరిపెట్టు

లేకుంటే కడుపు నొప్పెట్టు!

పెసరట్టమ్మా పెసరట్టు

పొట్ట నింపే పెసరట్టు

తిన్న కొద్దీ తినాలనిపించే

భలే రుచైన పెసరట్టు!

కాశీ విశ్వనాథం పట్రాయుడు_

9494524445​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్