- భారత వాతావరణ కేంద్రం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా, యానాం శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారి నారాయణ పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొన్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది, బలమైన గాలులు గంటలకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు.







కామెంట్‌లు (0)