బాలలం... బాలలం
మేము తెలుగు బాలలం
పెరటిలోని సిరి మల్లెలం
చీకటిలోని చిరు దివ్వెలం!
అచ్చుగుద్దిన అజంతాలం
అల్లుకొన్న అనుబంధాలం
మా పలుకులలో వుందిలే పంచదార
మా నడకలలో కనపడులే వంశధార!
తెలుగు జాతికి.. మేము
వారసత్వ సంపదలం
ఇంటి భాషకు.. మేము
కంటి పాపలం
తెలుగు భాషకు మురిపాలం
తెనుగు తల్లికి ముత్యాలం!
తెలుగు వైభవానికి
నిలిచిన కేతనాలం
తెలుగు సంస్కృతిని
ఎలుగెత్తి చాటే పులుగులం!
- జి. సూర్యనారాయణ,
62817 25659.







కామెంట్‌లు (0)