నీలి మబ్బుల నీలాకాశం
ఇంద్రధనస్సులో నీలి సోయగం
నీలి సముద్రం.. నీలి తిమింగలం
ఆహ్లాద వర్ణం.. అందరు మెచ్చే వర్ణం
నెమలికి నీలం మరింత అందం
పాలపిట్టకూ నీలమే అందం
నీలి కన్నులు పాపకు అందం
నీలి వన్నెల శంఖు పూలు
నీల కురింజి ప్రత్యేక పూలు
భలే భలే బ్లూబెల్స్ పూలు
నీలి సీతాకోక చిలుకలు
నీలి ఈగలు.. నీలి కందిరీగలు
నీలి మెరుపుల సొగసుల నగలు
నవరత్నాలలో నీలం ఒకటి
గిరులలోన నీలగిరి ఒకటి
నదులలో బ్లూ నైలు ఒకటి
- జె. శ్యామల, 99896 01113.







కామెంట్‌లు (0)