ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతిను పాపా! తిను

45 నిమిషాల క్రితం

gorumudda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 07:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తిను పాపా! తిను

తింటేనే శక్తి!

వింటేనే రక్తి!!

పైడి గిన్నెలో

పాయసం వుంది!

తినకుంటె నీవు

తింటాను నేనే!!

ఇంటిలో పిల్లి

ఇటే చూస్తోంది !

సందు దొరికితే

తిందామనేమొ!!


అందాల మామ

ఆ చందమామ

పాయసం కొరకు

చేయి చాపాడు!!


నోరు తెరిస్తే

గోరు ముద్దెడత!

సరిగా తినేస్తే

చిరుముద్ద పెడత!!

-‘బాలబంధు’ అలపర్తి వెంకట సుబ్బారావు

(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత), 9440805001


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్