నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానుండగా.. అంతకుముందు సెప్టెంబర్ 23న నిర్వహించే ప్రత్యేక ప్రీమియర్ షోలకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై ₹400, సింగిల్ స్క్రీన్‌లలో ₹300 వరకు అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉండగా.. సినిమాపై తప్పుడు, పరువునష్టం కలిగించే ఆన్‌లైన్ కంటెంట్ ప్రచారాన్ని నిరోధిస్తూ బెంగళూరు కోర్టు సెప్టెంబర్ 19న ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిజమైన సమీక్షలు, చట్టబద్ధమైన విమర్శలకు ఈ ఆదేశాలు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది.
‘ది ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)