ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచిన్న పని- పెద్ద పాఠం

2 గంటల క్రితం

chinna pani-pedda marpu katha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 07:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చింటూ ఆరు పూర్తిచేసి ఏడో తరగతిలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. పాఠశాలకు_ వెళ్లే రోజుల్లో కూడా అతను ఇంటిపనులు చేయకుండా తప్పించుకునేవాడు. తల్లి అతనికి చిన్న చిన్నపనులు నేర్పాలని ప్రయత్నించినా, చింటూ వాయిదా వేసి అలసత్వం ప్రవర్తించేవాడు. ఒకరోజు తల్లి అతనికి పాఠశాల యూనిఫాం వాషింగ్ మెషిన్‌లో వేయమని చెప్పింది. చింటూ విననట్టే బయటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా యూనిఫాం నేలపై పడేసి టీవీ ముందు కూర్చున్నాడు. తల్లి ఆ యూనిఫాం వాషింగ్ మిషన్ లో వేయాలనుకుంది. అలా చేస్తే చింటూ ఎప్పటికీ నేర్చుకోడని భావించి వదిలేసింది. తర్వాత రోజు ఉదయం చింటూ స్కూల్‌కు రెడీ అవుతుంటే, రెండు యూనిఫాంలూ ఇంకా ఉతకలేదని గ్రహించాడు. అమ్మ అతనికి సివిల్ డ్రస్ లోనే వెళ్లాలని చెప్పింది. చింటూకి ఇష్టం లేకపోయినా అలాగే_ వెళ్లాడు. స్కూల్ గేట్ దగ్గర హెడ్‌మాస్టర్ అతన్ని ఆపి యూనిఫాం లేకపోవడంతో రెండు గంటలు బయట నిలబెట్టాడు. ఆ సమయం చింటూకి చాలా కష్టంగా అనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చి జరిగినదంతా తల్లికి చెప్పాడు. యూనిఫాం వాషింగ్ మెషిన్‌లో వేయడానికి ఒక నిమిషం పడతుంది. వినకపోవడం వల్ల రెండు గంటలు నిలబడాల్సి వచ్చిందని అర్థమయ్యేలా వివరించింది. పైగా పాఠాలు కూడా వినకుండా ఉండటం చింటూకి బాధకలిగించింది. చింటూకి తల్లి మాటలతో జ్ఞానోదయం కలిగింది. ఇకపై పనులు వాయిదా వేయకూడదని నిర్ణయించుకున్నాడు. చిన్నపని అయినా ఎంత పెద్ద పాఠం నేర్పుతుందో చింటూ గ్రహించాడు.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, బీటెక్ మూడో సంవత్సరం (ఈసీఇ),

ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల, ఖమ్మం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్