ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చదువుతో పాటు...

1 గంట క్రితం

jeevanasubbareddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 08:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నేను ఈ పాఠశాలకు 8వ తరగతిలో వచ్చాను. కొత్తలో బాలానందం అనే సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ అనుకుని తరగతిగదికి వెళ్ళిపోయాను._కానీ హాస్టల్లో ఉంటూ బాలానందంలో_ పాల్గొన్నప్పుడు ఆ సంతోషం చెప్పలేనిది. అంతేకాదూ! పరీక్షలలో మార్కుల కోసం ఒత్తిడి పెట్టరు. ఎప్పుడూ క్లాస్‌‌రూమ్‌‌లోనే కాకుండా చుట్టుపక్కల ప్రకృతి నుండి కూడా చాలా నేర్చుకునే విధంగా ప్రోత్సహిస్తారు. మా స్కూల్లో విలువలతో కూడిన చదువును అత్యంత అధునాతన విధానాలతో బోధిస్తారు. నాకు ఇక్కడకు రాగానే మొదటగా నచ్చింది ఏమిటంటే విజ్ఞానము, సేవ, వీటన్నిటినీ స్కూల్లో నేర్పిస్తారు. సాధారణంగా ఒక్కొక్క పిల్లవాడిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది."where every child is special " అంటే మా దగ్గర ప్రతి ఒక్క పిల్లవాడిలో ప్రత్యేకత ఉంది. ఎవరెవరిలో ఎటువంటి నైపుణ్యం ఉందో గుర్తించి, ఆ పిల్లలను ఉన్నంతగా తీర్చిదిద్దడం స్కూలు టీచర్స్‌ ‌చేస్తారు. నా విషయానికి వస్తే నాకు సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువ. మన అరవిందాలో చదువుతోపాటు ఆటలు, పాటలు అన్నీ నేర్పిస్తారు. నేను సంగీతం శ్రద్ధగా నేర్చుకున్నాను. చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అన్నిటినీ నేర్పుతారు.

జి. జీవన్‌ ‌రామసుబ్బారెడ్డి,

10వ తరగతి,

అరవింద హైస్కూలు, కుంచనపల్లి, గుంటూరు జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్