సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్ధుల పోరాటాలు కొత్త ఆశలను చిగురింపజేశాయి

1 గంట క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 08:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్

లండన్: విద్యావ్యవస్థలో జవాబుదారికోసం, భవిష్యత్తుపై భరోసా కోసం భారత విద్యార్థులు సాగించిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ధర్మేంద్ర ప్రదాన్‌‌ రాజీనామాతో విద్యార్థులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అదివారం నాడు లండన్‌లోని ప్రఖ్యాత ట్రాఫాల్గర్ స్క్వేర్‌లో భారత విద్యార్థి ఫెడరేషన్‌-యునైటెడ్ కింగ్‌డమ్ (ఎస్‌ఎప్‌ఐ-యుకె) కమిటి విక్టరీ డే నిర్వహించింది. ఈ సభకు హాజరైన ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ మాట్లాడుతూ భారత విద్యార్థులు చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తల్లో కొత్త ఆశలను చిగురింపజేసిందని తెలిపారు. పోరాడేవారి శక్తిని ఈ విద్యార్థి ఉద్యమం చాటి చెప్పిందని తన సంఘీభావాన్ని తెలిపారు. అలాగే, ఎస్‌ఎఫ్‌ఐ-యుకె విభాగం గ్రెటా థన్‌బర్గ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. భారత విద్యార్థి పోరాటానికి మద్దతుగా ఆమె ఈ నిరసనలో పాల్గొనడం గర్వకారణమని పేర్కొంది. ప్రజల శక్తి ఎంతటిదో ఈ విద్యార్థి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలలో లండన్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ 'విక్టరీ డే' వేడుకల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని తమ విజయానందాన్ని పంచుకున్నారు. విద్యార్థి పోరాటాల ద్వారా సాధించిన ఈ విజయం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్