mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోకీమాన్ పాత్రలతో ఆరోగ్య పాఠం!

2 రోజుల క్రితం

child
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 11:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మన శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడే రోగనిరోధక వ్యవస్థ గురించి పిల్లలకు చెప్పడం అంత సులభం కాదు. వైరస్‌లు, బ్యాక్టీరియా, యాంటీబాడీలు, తెల్ల రక్తకణాలు వంటి అంశాలు పెద్దలకే క్లిష్టంగా అనిపిస్తాయి. అలాంటివి చిన్నారులకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలనే ప్రశ్నకు మెక్సికోకు చెందిన ఇమ్యునాలజిస్టు మేరియన్ బ్రుంక్ వినూత్న సమాధానం కనుగొన్నారు. తన కుమారుడు, అతని స్నేహితులు పోకీమాన్ కార్డులపై చూపుతున్న ఆసక్తిని గమనించిన మేరియన్‌కు ఒక ఆలోచన వచ్చింది. మన శరీరంలోని రోగనిరోధక కణాలు కూడా పోకీమాన్ పాత్రల్లాగే ప్రత్యేక శక్తులు కలిగి ఉంటాయని ఆమె భావించారు. కొన్ని కణాలు శత్రువులను గుర్తిస్తాయి, కొన్ని వాటిపై దాడి చేస్తాయి, మరికొన్ని యాంటీబాడీలను తయారు చేస్తాయి. ఈ పోలిక ఆధారంగా ఆమె రోగనిరోధక కణాలపై ట్రేడింగ్ కార్డులను రూపొందించారు. ఎఐ సాయంతో ఆకర్షణీయమైన చిత్రాలు రూపొందించి, ప్రతి కార్డుపై ఆ కణం చేసే పనిని సరళంగా వివరించారు. పిల్లలు ఈ కార్డులను సేకరిస్తూ, మార్చుకుంటూ, ఆడుకుంటూ రోగనిరోధక వ్యవస్థ గురించి నేర్చుకోవడం ప్రారంభించారు. మొదట అత్యంత శక్తివంతమైన కణం ఏదో వెతికిన వారు, చివరకు శరీరాన్ని కాపాడేది ఒక్క కణం కాదని, అన్ని కణాలు కలిసి పనిచేసే వ్యవస్థేనని గ్రహించారు. తర్వాతి దశలో వైరస్‌లు, బ్యాక్టీరియా, క్యాన్సర్ కణాలు వంటి "శత్రువులను" కూడా కార్డుల్లో చేర్చారు. ఇలా పిల్లలు ఆటలో భాగంగానే సైన్సును సులభంగా అర్థం కోవటం మొదలు పెట్టారు. "శాస్త్రాన్ని పిల్లలకు ఇష్టమైన ఆటల్లో, కథల్లో భాగం చేస్తే వారు తెలియకుండానే నేర్చుకుంటారు" అని మేరియన్ తన అనుభవం ద్వారా చెబుతున్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్