మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులకు సంఘీభావంగా వాంగ్‌చుక్‌ నిరసనను కొనసాగిస్తారు : గీతాంజలి ఆంగ్మో

4 గంటల క్రితం

Gitanjali Angmo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 05:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : విద్యార్థులపై పోలీసుల క్రూరత్వాన్ని నిరసనగా, విద్యార్థులకు సంఘీభావంగా వాంగ్‌చుక్‌ నిరాహారదీక్ష‍ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారని ఆయన భార్య గీతాంజలిఅంగ్మో పేర్కొన్నారు. వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌గంజ్ ఆస్పత్రి నుండి మెదాంత ఆస్పత్రికి తరలించేందుకు అనుమతిస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె స్వాగతించారు. ఆస్పత్రి మార్చేందుకు అనుమతించిన హైకోర్టుకు ధన్యావాదాలు తెలుతున్నానని అన్నారు. దేశంలో, ఒక పౌరుడికి తనకు నచ్చిన వైద్యుడిని, ఆస్పత్రిని, చికిత్సను ఎంచుకునే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందని అన్నారు. సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తీసుకువచ్చిన విధానంతో తమకు అపనమ్మకం ఏర్పడిందని అన్నారు. వాంగ్‌చుక్‌ను ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని, జంతర్‌మంతర్‌లోనే ఆయనకు వైద్య చికిత్స అందించి ఉండవచ్చని అన్నారు. బయటి వ్యక్తులు ఆయనను కలవకుండా అడ్డుకున్నారని అన్నారు. పలువురు ఎంపిలు ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చారని, కానీ ఎవరినీ అనుమతించలేదని, ఇది ఆయనను నిర్బంధించడం, బంధించడమేనని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్