మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడలో కదంతొక్కిన నిరుద్యోగులు

4 గంటల క్రితం

Unemployed youth rally in Kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 03:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.

  • పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 10 వేలు పెంచకపోతే ఛలో విజయవాడకు సిద్ధం - డివైఎఫ్ఐ

01


కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 11,639 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని లేని పక్షంలో నిరుద్యోగులంతా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఛలో విజయవాడ నిర్వహిస్తాం అని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న హెచ్చరించారు. మంగళవారం కాకినాడలో నిరుద్యోగులు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కొండయ్యపాలెం బ్రిడ్జి జెండా సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రోడ్డు పైనే బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఖాళీలతో సంబంధం లేకుండా, నిరుద్యోగులతో సంబంధం లేకుండా కేవలం 2500 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. కనీసం పది వేల పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేనందున అర్హత వయస్సు 35 సం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం గతంలో 19,999 ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీలో హోంశాఖమంత్రి అనిత ప్రకటించడం జరిగిందని, కానీ 11,639 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతిని బోర్డు కోరడం జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో జాబ్ లే లేవన్నారు. నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు ఏమో డిగ్రీ, పిజీలు చదివిన వారికి ఒక్క ఉద్యోగం లేదని కానీ ఇంటర్ ఫేయిల్ అయినా వారు ముడు, నాలుగు శాఖలకు మంత్రులుగా ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల పై ఢిల్లీ పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఉపాధి ముసుగులో లక్షల ఎకరాల ప్రభుత్వ, రైతుల భూములను పెద్ద పెద్ద కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టి కమిషన్లు కక్కుర్తి పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం. ఇప్పటికే అనేక జిల్లాలో ఉద్యమం ప్రారంభం అయిందని రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి పోస్టులు పెంచకపోతే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎమ్. హరేంధిర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు టి. రాజా, వాసు, సత్యం, జయరాం, ఆదర్శ కార్తిక్, రాజు, రామకృష్ణ, నిరుద్యోగ అభ్యర్థలు అంజిబాబు, ప్రదీప్, కార్తీక్, వీరేంద్ర, కృష్ణకుమారి, అమృతవల్లి, ఐశ్వర్య, నాగమణి, కర్ణ తదితరులు పాల్గొన్నారు.

kakinada


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్