ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకోడి దొంగ

1 గంట క్రితం

BALALA KATHA2(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 08:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అక్బర్ దగ్గరికి కాంతమ్మనే ముసలావిడ వచ్చి, ‘నాకున్న ఓ కోడిని దొంగలెత్తుకు పోయారు ప్రభు! న్యాయం చేయండి’ అని బోరుమంది.

​‘కాంతమ్మ నీకు ఎవరి మీదైనా అనుమానం గాని ఉందా?’ అని అడిగారు అక్బర్. ‘ సూరయ్య, నారయ్య మా ఇరుగుపొరుగు వాల్లే’అంది కాంతమ్మ.

వెంటనే సూరయ్య, నారయ్యలను పిలిపించి, ‘కాంతమ్మ కోడిని మీరు దొంగిలించారా?’ అని గట్టిగా అడిగారు అక్బర్. ‘నేను చేయలేదండి, నేను చేయలేదు’ అని సూరయ్య, నారయ్యలు వినయంగా బదులిచ్చారు.

‘సర్లే సూరయ్య మీది ఏమి కూర?’

‘పప్పు తోటకూర ప్రభు’ అని వెంటనే చెప్పాడు సూరయ్య. ‘మరి నారయ్య మీదేం కూర?’ ‘ఆ ..ఆ.. రాత్రి అసలు అన్నమే తినలేదండి చెకోడి కాదు..కాదు, పకోడీ పొట్లం తిని, నీళ్లు తాగాను ప్రభు’ అని అన్నాడు నారయ్య.

‘బీర్బల్! రేపు తెల్లారే సరికి కోడిదొంగ దొరకాలి. అందాక వీళ్ళని ఇక్కడే చెరసాలలో ఉంచండి’ అని ఆదేశించారు అక్బర్.

‘చిత్తం ప్రభు’అంటూ అభివాదం చేశాడు బీర్బల్.

మరుసటి రోజు ‘కోడిదొంగ దొరికాడా బీర్బల్?’ అడిగారు అక్బర్.

​‘ఆ దొరికాడు జహాపనా!’ అన్నాడు బీర్బల్.

‘అయితే ఆ దొంగను ప్రవేశ పెట్టమ’ని ఆదేశించారు అక్బర్ చక్రవర్తి.

‘ఆ కోడిదొంగ ఎవరో కాదు, ఈ నారయ్యే’ అన్నాడు నవ్వుతూ బీర్బల్. ‘నారయ్యా! అసలు కోడిని దొంగతనం చేయలేదు’ అని అంటున్నాడు కదా! అని గట్టిగా అడిగారు అక్బర్.

​‘జహాపనా! నిన్న మీరు సూరయ్యను కూర అడగగానే తడుముకోకుండా వెంటనే చెప్పాడు, కానీ నారయ్య కాసేపు ఆలోచించి చెకోడీ, పకోడీ అననీ మాటలు తడపడ్డాడు. ఇక రాత్రి ఇద్దరినీ చెరసాలలో బంధించినప్పుడు సూరయ్య గురక పెట్టి మరి నిద్రపోయాడు, కానీ నారయ్య మాత్రం భయంగా కోడి నిద్ర పోయాడు. తప్పుచేసిన వాడికే భయం ఎక్కువ.కాబట్టి ఖచ్చితంగా ఆ కోడి దొంగ ఈ నారయ్యే’ అన్నాడు బీర్బల్.

​‘ప్రభు క్షమించండి! ఏంకూర లేక కాంతమ్మ కోడిని కోసుకుతిన్నాను. ఆమెకు నేను రెండుకోళ్లు కొనిస్తానూ, ఇక ఎప్పుడూ దొంగతనం చేయను’ అని దండం పెట్టాడు నారయ్య.

అమ్మిన వెంకట అమ్మిరాజు

94407 08656


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్