ఒక ఊరిలో మణికంఠ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. చెట్లకు నీళ్లు పోస్తాడు, పక్షులకు ఆహారం ఇస్తాడు. ఒకరోజు అతనికి దారిలో ఒక రాయి కనిపించింది. దానిపై వాళ్ల ఊరి చిత్రం గీసి ఉంది. అది చూసి మణికంఠ చాలా ఆశ్చర్యపోయాడు. తను ఎటు కదిలితే అటు ఆ రాయి కూడా కదిలింది. ఆ రాయిని తీసుకుందామని దాన్ని పట్టుకున్నాడు. అంతే.. తను వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయాడు. అక్కడ చెట్లు మాట్లాడుతున్నాయి, జంతువులు మాట్లాడుతున్నాయి.
మణికంఠ తనకు కనిపించిన మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి, ‘నాకు మామిడిపండు ఇవ్వవా?’ అని అడిగాడు. వెంటనే ఆ చెట్టు రుచికరమైన మామిడి పండ్లను ఇచ్చింది. అడగగానే పండు ఇచ్చినందుకు ఎంతో సంతోషించాడు. ప్రతిరోజూ తాను ఇంటి దగ్గర చెట్లకు చేసిన సాయానికి కృతజ్ఞతగా చెట్లు ఇప్పుడు తనపై చూపిస్తున్న ప్రేమను చూసి మణికంఠ ఆనందంతో పొంగిపోయాడు.
నీతి: ప్రకృతిలో అన్ని రకాల ప్రేమలు ఉంటాయి. మనం మంచి చేస్తే ప్రకృతి మనకు మంచి చేస్తుంది.
– యమ్. లీలా వెంకటకృష్ణ,
8వ తరగతి,
అరవింద మోడల్ స్కూలు,
మంగళగిరి.







కామెంట్‌లు (0)