రాంపూర్ అందమైన ఊరు. ఒకరోజు ఊర్లో మొక్కలు పెంచే కార్యక్రమం మొదలుపెట్టారు. గ్రామంలో ఒక వీధిలో వాళ్ళు చాలా మొక్కలు పెంచారు. కానీ ఇంకో వీధిలో మాత్రం ఒక్క మొక్క కూడా పెంచలేదు. మొక్కలు పెంచిన వీధి ఎంతో అందంగా, పచ్చదనంతో, మంచి గాలితో ప్రశాంతంగా ఉంది. మొక్కలు పెంచని వీధి అంత అందంగా, ప్రశాంతంగా లేదు. ఒకరోజు ఆ ఊరి సర్పంచ్ గ్రామమంతా పరిశీలిస్తున్నప్పుడు ఒక వీధిలో మాత్రం మొక్కలు లేకపోవడం చూసి చాలా బాధపడ్డారు. అదే పక్క వీధిలో ప్రజలు చాలా మొక్కలు పెంచి ఎంతో అందంగా వాళ్ల వీధిని తీర్చిదిద్దారు. అప్పుడు ఆ సర్పంచ్ మొక్కలు పెంచని వీధికి వెళ్లి పక్క వీధిలో పెంచినట్టుగా మొక్కలు పెంచమని చెప్పాడు. చెట్లు ఉంటే మనకు మేలు కలుగుతుందని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆ వీధి వాళ్లు కూడా మొక్కలు పెంచడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ వీధి కూడా ఎంతో అందంగా ప్రశాంతంగా మారింది. ఆ రోజు నుండి ఆ రెండు గ్రామాల ప్రజలు మెక్కలను పెంచమని మిగతా గ్రామాల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ‘చెట్లు పెంచడం వల్ల మనకు మంచి గాలి, నీడ, పండ్లు, కూరగాయలు లభిస్తాయి. మంచి గాలి పీల్చుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. చెట్లు పెంచడం వల్ల వానలు పడతాయి. తద్వారా పంటలు కూడా బాగా పండుతాయి. చెట్లు లేకపోతే మన జీవనం కష్టం. అందుకే చెట్లను పెంచుదాం, ఆరోగ్యంగా ఉందాం’ అన్న ప్రచారాన్ని ఓ ఉద్యమంలా చెపట్టారు.
నీతి : పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు
- పి.నిషాల్, 5వ తరగతి,జడ్పీ స్కూలు,
రాంపూర్, నిజాంపేట మండలం, మెదక్ జిల్లా.







కామెంట్‌లు (0)