ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్వచ్ఛమైన స్నేహం

1 గంట క్రితం

friends
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 07:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

జీవితంలో స్నేహం అనేది అత్యంత స్వచ్ఛమైన, అమూల్యమైన బంధం. కష్టకాలంలో అండగా నిలవడం, ఒంటరితనాన్ని దూరం చేసి మానసిక ధైర్యాన్ని ఇవ్వడం స్నేహం గొప్పతనం. ఇది ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించనిది. జీవితాంతం మనతో నడిచే తోడు. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహం అత్యంత విలువైన బంధాల్లో ఒకటి. కొందరు స్నేహితులతో ఆనంద క్షణాలను మాత్రమే పంచుకుంటే, మరికొందరు వారి సంతోషాన్ని తమ సంతోషంగా, వారి బాధను తమ బాధగా భావిస్తూ ప్రతి పరిస్థితిలో అండగా నిలుస్తారు. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహభావం ఉండాలి. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎలాంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. 'స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది'. 'జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది'. స్నేహం ఎంతో తియ్యనైంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం అలాగ ఉండాలి. అలాంటి స్నేహంలో నేను ఎంతో ఆనందం పొందుతున్నా.

-ఈనోష్‌ ఫృథ్వీ లోకేష్‌ కార్తీక్‌

10వ తరగతి, ప్రగతి బాల విద్యాలయం,

తాడేపల్లి, గుంటూరు జిల్లా. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్