మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యుటిఎఫ్ సీనియర్ కామ్రేడ్ పాదూరి సేవలు ఎనలేనివి

1 గంట క్రితం

UTF Senior Comrade Paduri's services are unheard of
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వర్ధంతికి పలువురు కామ్రేడ్స్ ఘన నివాళి.


ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : యుటిఎఫ్ సీనియర్ నేత, మండల పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు, సిపిఎం అభిలాషి కామ్రేడ్ పాదూరి శ్రీనివాసరావు సేవలు ఎనలేనివని పలువురు కామ్రేడ్స్ కొనియాడారు. మండల కేంద్రంలోని పెన్షనర్స్ హోమ్ లో స్వర్గీయ కామ్రేడ్ పాదూరి వర్ధంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వారంతా పాదూరి చిత్రపటానికి పూలమాలలు వేసి, జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ సీనియర్ నేతలు మాట్లాడుతూ యుటిఎఫ్ సంఘ పటిష్టతకు పాదూరి శ్రీనివాసరావు చేసిన సేవలు అత్యంత ఆదర్శంగా పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ సహుద్యోగుల సమస్యలపై వేగంగా స్పందిస్తూ, ఎన్నో సుదీర్ఘమైన ఉద్యమాలలో పాల్గొన్న ఘనత ఆయనకే సొంతమన్నారు. వృత్తిని దిగ్విజయంగా పూర్తి చేసుకొని పదవి విరమణ పొందినప్పటికీ, యూటీఎఫ్ సంఘ అభివృద్ధికి ముందుగా స్పందించే వ్యక్తి ఆయన అన్నారు. అలాంటి అరుదైన కామ్రేడ్ ను యుటిఎఫ్ కోల్పోవడం సంఘానికి తీరని లోటన్నారు. అదేవిధంగా ఆయనతో అనుబంధం ఉన్న పలువురు సీనియర్ కామ్రేడ్స్ పాదూరి చేసిన సేవలను గుర్తు చేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ కామ్రేడ్స్ కె.వి.ఆర్.బాపూజీ, జి.భాస్కర్ రెడ్డి, జె.ఏసురాజు, ఎన్.రాజగోపాల్, గిడ్డి ప్రకాశం, సిహెచ్.వి.వి.వెంకటేశ్వరరావు, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు వై వి వి రమణ, జిల్లా నాయకులు మూర్తి, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్