ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : విద్యార్థులను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కరవాక హైస్కూల్‌లో హెష్ ఎమ్ కె హరనాథ్ ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ చట్టాలపైఎస్ ఐ పద్మారావు మంగళవారంవిద్యార్థుల కు అవగాహన కల్పించారు గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలు, చట్టపరమైన పరిణామాలపై వివరించారు.మత్తు పదార్థాలకు అలవాటు పడితే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.అలాగే సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలి, అనుమానాస్పద సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు ఎస్ ఐ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సైబర్ చట్టాలు పై విద్యార్థులకు అవగాహన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 04:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)