గుండారం అనే ఊరిలో రామయ్య, లక్ష్మి అనే రైతు దంపతులు ఉన్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. వారిని చదివించడానికి రామయ్య బాగా కష్టపడ్డాడు. లక్ష్మీ కూడా పొలంలో పనిచేసేది. కుమార్తెలను పెద్ద పెద్ద చదువులు చదివించాలని వారి కోరిక. ఒక సంవత్సరం వర్షాలు లేక పంట దిగుబడి రాలేదు. చేతిలో డబ్బులేదు. పిల్లలను ఎలా చదివించాలో రామయ్యకు అర్థంకాలేదు. కష్టాలు ఎలా తీరుతాయని లక్ష్మీ బాధపడింది. ఒక రోజు రామయ్య పట్నానికి వెళ్ళాడు. అక్కడ తన స్నేహితుడు గోపయ్య కలిసాడు. గోపయ్య- పట్నంలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. రామయ్య తన బాధను స్నేహితునికి చెప్పాడు._‘దిగులుపడకు మిత్రమా!, నీకు నేను సాయం చేస్తాను’ అని గోపయ్య రామయ్యకు కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్య సంతోషంతో ఇంటికి వచ్చి, కుమార్తెలను స్కూల్లో చేర్చాడు._కొన్ని సంవత్సరాల తర్వాత రామయ్య కుమార్తెలకు ఉద్యోగాలు వస్తాయి. గోపయ్యకు రామయ్య తిరిగి డబ్బులు చెల్లించాడు. ఆపద సమయంలో ఆదుకున్నందుకు గోపయ్యకు రామయ్య కృతజ్ఞతలు తెలిపాడు.
నీతి: కష్టాల్లో ఉన్న స్నేహితులకు సహాయం చేయాలి.
దూపల్లి శివనందిని
8వ తరగతి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
అనంత సాగర్, సిద్దిపేట జిల్లా._








కామెంట్‌లు (0)