న్యూఢిల్లీ : లోక్‌సభలో సోమవారం ‘పబ్లిక్ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ ) సవరణ బిల్లు’, 2026ను కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈబిల్లును సభలో ప్రవేశపెట్టారు. పేపర్‌లీక్‌లకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు విధించనున్నట్లు ఈ బిల్లు ప్రతిపాదించింది. 2024 చట్టం కింద నిర్దేశించిన శిక్షలను ఈ బిల్లు కఠినతరం చేయనుంది. ఈ బిల్లు ప్రకారం.. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలపై దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి వుంటుంది. ప్రశ్నాపత్రాల లీక్‌కు పాల్పడిన నింతులకు 5 ఏళ్లు, గరష్టంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించనుంది. వ్యవస్థీకృత నేరాల విషయంలో కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానాలను విధించనున్నట్లు ఈ బిల్లు ప్రతిపాదించింది.
ఈ బిల్లు ఒక తాత్కాలిక పరిష్కారం : కాంగ్రెస్
ఈ బిల్లు తాత్కాలిక పరిష్కారమే (బ్యాండ్ ఎయిడ్) అని కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, విద్యావ్యవస్థలోని సవాళ్లను పరిష్కరించేలా ఒక బిల్లును తీసుకువచ్చేదని అన్నారు. కేవలం యువతను శాంతిపచేయడానికి ‘పబ్లిక్ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ ) సవరణ బిల్లు’ను ప్రవేశపెట్టారని మండిపడ్డారు. అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నోటీసు ఇచ్చామని అన్నారు.








కామెంట్‌లు (0)