సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మళ్లీ తూర్పు గోదావరిలో పెద్ద పులి

1 గంట క్రితం

Tiger spotted again in East Godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 01:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గోపాలపురం (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచరిస్తోంది. దీంతో సమీప ప్రాంత ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. గోపాలపురం మండలం కరకపాడు, నందిగూడెం, అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. పులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మూడు బృందాలుగా విడిపోయి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. డ్రోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పెద్ద పులి సంచారం వేళ స్థానికులు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా గ్రామాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్