పొంగి ప్రవహిస్తున్న మత్స్యగెడ్డ.. జలపాతాలు..
స్తంభించిన జనజీవనం...
ప్రజాశక్తి-పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల గత రెండు రోజుల నుంచి అల్లూరి మన్యంలో ఎడతెరిపి లేకుండా జోరు వాన కురుస్తోంది. జనసంచారం పూర్తిగా స్తంభించింది. సీతారామరాజు జిల్లాలోని 11 మండలాల్లో వర్షపాతం అధికంగా ఉంది. జిల్లాలో మంగళవారం పగలు వర్షపాతం 27.2 మిల్లి మీటర్లు నమోదయింది. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో జిల్లా పరిధిలోని మత్స్యగెడ్డలు కొండ వాగులు ఉదృతంగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాన ఉధృతి వల్ల జిల్లాలో బుధవారం అన్ని ప్రాథమిక పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా ఉన్న కొత్తపల్లి జలపాతం, గుర్రాయి జలపాతం, మాచ్ ఖండ్ జలపాతం, కటికి జలపాతం, తదితర మన్యంలోని జలపాతాలు ఉప్పొంగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరద నీరు ఉదృతికి ఈ జలపాతాలు ప్రమాదకర స్థితికి చేరాయి.. బుధవారం ఉదయం నుంచి వాన జోరు మరింత పెరిగింది. జిల్లాలోని 11 మండలాల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు .38.2 మిల్లీమీటర్ల వర్షపాతం. పది నుంచి 12 గంటల మధ్యలో 55.8 మిల్లీమీటర్లు 12 నుంచి రెండు గంటల మధ్యలో 83. 4 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదయింది. ఈ మేరకు జిల్లా మొత్తం 177.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా బుధవారం మధ్యాహ్నానికి జిల్లా యావరేజ్ 16.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వాయుగుండం తీరం దాటే సమయానికి అల్లూరి జిల్లా లో వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికను జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం ఆప్రమత్తమయ్యింది. బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితిని అంచనా వేసి ముందస్తు చర్యలను తీసుకున్నారు.








కామెంట్‌లు (0)