సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనగణన నిబంధనల సవరణలను వెనక్కి తీసుకోవాలి

1 గంట క్రితం

baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 01:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ డిమాండ్

​న్యూఢిల్లీ : జనగణన నిబంధనల్లో కేంద్ర హోం శాఖ చేసిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ డిమాండ్ చేశారు. ఈ సవరణలు ప్రమాధకరమన్నారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

​ఎవరైనా ఎన్యూమరేటర్ కావచ్చు

కొత్తగా నోటిఫై చేసిన సవరణల ప్రకారం, ప్రైవేటు స్కూలు టీచర్లు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల సభ్యులు ఎన్యూమరేటర్‌గా (జనగణన కర్త) పనిచేయవచ్చు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంత పాలనా విభాగం ‘‘సరైన వ్యaక్తి’’గా భావించిన ఎవరికైనా ఈ బాధ్యత అప్పగించవచ్చు. దీనివల్ల పౌరుల ప్రైవేటు సమాచారాన్ని పొందేందుకు సంఘ పరివార్‌కు దొడ్డిదారి తెరుచుకుంటుందని బేబీ విమర్శించారు. జనగణన రెండో దశలో వ్యక్తిగత వివరాలు అడుగుతూ నోటిఫై చేసిన ప్రశ్నావళిలో ఆధార్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, మతం, తల్లిదండ్రుల జన్మస్థలం వంటివి ఉన్నాయి. ఇవి సేకరించవద్దని కోరుతూ ఆగస్టు 24న సిపిఎం తరఫున రిజిస్ట్రార్ జనరల్, జనాభా కమిషనర్‌లకు మెమొరాండం ఇచ్చామని బేబీ తెలిపారు. జనగణన డేటాను ఇతర డేటాబేస్‌లతో అనుసంధానం చేయకుండా కఠిన రక్షణలు తీసుకోవాలని కూడా అందులో కోరామన్నారు. జనగణనకు అవసరం లేని వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు సంఘ పరివార్ ఏజెంట్లను నియమించడమంటే, పౌరసత్వం నిర్ణయించేందుకు, ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు జనగణనను ఆయుధంగా వాడటమేనని బేబీ విమర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చూస్తోందని, ఇది ప్రజల మనోభావాలను, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్