మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మికులకు వేతనాలు పెంచాలని ప్రచార జాత : సిఐటియు

27 జులై, 2026

Campaign rally demanding wage hikes for workers: CITU
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 04:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనకాపల్లి : ఎస్ ఈ జెడ్, ఫార్మా బ్రాండిక్స్ , స్కీం వర్కర్లకు వేతనాలు పెంచాలని ఈ నెల 30 ,31 వ తేదీ ల్లో అనకాపల్లి కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సోమవారం అచ్చుతాపురంలో ప్రచార జాత నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము మాట్లాడుతూ .... ప్రభుత్వాలు 2017 నుండి ఇప్పటివరకు కనీస వేతనాల జీవో సవరించకపోవడం వలన కార్మికులు వేతనాలు కోల్పోతున్నారని ప్రతి ఐదు సంవత్సరాలకి వేతన సవరణ చేయాల్సి ఉన్న ప్రభుత్వాలు కార్మికుల కు వేతనాలు పెంచడం లేదు ఈ మధ్యకాలంలో తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు 20 నుండి 60 శాతం వేతనాలు పెంచారు ప్రభుత్వ విధానాల వల్ల నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తక్కువ వేతనంతో పిల్లల చదువులు, ఆసుపత్రి , తిండి,బట్ట ,ఇంటిఅద్దెలు, రవాణా ,కరెంటు ,సరుకులు వినోదాలు ,పండుగలు కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు 1992లో సుప్రీంకోర్టు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు కనీసం నెలకు 26,000 ఇవ్వాలని తీర్పు చెప్పింది అందువల్ల కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలు జీవోలను సవరించి వేతనాల పెంపు జీవో సవరించాలని, కార్మికులకు నష్టదాకమైన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని 30, 31 వ తేదీ ల్లో జరిగే కలెక్టరేట్ ధర్నాకు కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చలపతి, కార్మికులు రాజు, చిన్న కార్మికులు మహిళలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్