ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చొప్పెల్ల పంచాయతీ కార్యాలయంలో పారసంస్థ సిబిఆర్ కోఆర్డినేటర్ బడుగు మహిమారావు ఆధ్వర్యంలో 2016 దివ్యాంగుల హక్కుల చట్టం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ గా హాజరైన ల్యాంప్ సంస్థ అడ్వకేసి కోఆర్డినేటర్ బడుగు సుబ్బాయమ్మ మాట్లాడుతూ దివ్యాంగులకు చట్టం, ప్రభుత్వ పథకాలలో బాగంగా ట్రైన్, బస్సు పాసులు పొందేవారు ఏ కేటగిరి దివ్యాంగుల పరిధిలోకి వస్తారన్నారు. రూ.15 వేలు పింఛన్ కి ఎవరు అర్హులు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఎవరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ హక్కులని మీరు కాపాడుకోవాలన్నారు. సదరం స్లాట్ బుకింగ్ ముందు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలని, కొత్త పెన్షన్ లు ఎలా అప్లై చేయాలనే విషయాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా సదరం సర్టిఫికెట్లో బహుళ వికలాంగత్వం, రీ అసెస్మెంట్ కి వెళ్ళిన వారికి ఇంతవరకు సర్టిఫికెట్స్ రాకపోవడం పలు విషయాలను ఈ మీటింగ్స్ ద్వారా క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. అనంతరం దివ్యాంగులతో గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పీహెచ్సి చైర్మన్ ఆకుల రామకృష్ణ, కార్యదర్శి పాలింగి రాజు, దివ్యాంగులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
దివ్యాంగుల హక్కుల చట్టం పై అవగాహన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 02:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)