మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజస్థాన్‌లో బిజెపికి ఊహించని షాక్.. నెగ్గిన ఆర్‌ఎల్‌పి అభ్యర్థి !

1 గంట క్రితం

Unexpected shock for the BJP in Rajasthan... RLP candidate wins!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 02:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జైపూర్ : రాజస్థాన్‌లోని నాగావుర్ జిల్లా ముండ్వా పురపాలక సంఘం (మున్సిపాలిటీ) ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఊహించని రీతిలో భారీ షాక్ తగిలింది. మొత్తం 25 వార్డులు ఉన్న ఈ పురపాలక సంఘంలో 10 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, బిజెపి అధికారిక అభ్యర్థి గీతాదేవికి ఒక్క ఓటు కూడా పడకపోవడం తీవ్ర కలకలం రేపింది.


కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పి) అభ్యర్థి అల్కాదేవి కాండోయ్ 13 ఓట్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేశారు.


విమత నేత తిరుగుబాటు.. సొంత కౌన్సిలర్ల హ్యాండ్‌ఓవర్:


ఛైర్‌పర్సన్ టికెట్ దక్కలేదనే అసంతృప్తితో బిజెపి సీనియర్ నేత ఘన్‌శ్యామ్ సదావత్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో బిజెపికి చెందిన పదిమంది కౌన్సిలర్లు అధికారిక అభ్యర్థిని కాదని ఘన్‌శ్యామ్‌కే తమ మద్దతు ప్రకటించారు. ఫలితంగా పార్టీ అధికారిక అభ్యర్థి గీతాదేవికి 'సున్నా' ఓట్లు వచ్చాయి.


మరోవైపు, కేవలం 3 స్థానాలు ఉన్న కాంగ్రెస్, 7 స్థానాలు ఉన్న ఆర్‌ఎల్‌పి పార్టీలు చేతులు కలిపాయి. వీరికి ముగ్గురు స్వతంత్ర కౌన్సిలర్లు తోడవడంతో ఆ కూటమి బలం 13కు చేరింది. కేవలం ఒక్క ఓటు తేడాతో ఆర్‌ఎల్‌పి అభ్యర్థి అల్కాదేవి విజయం సాధించారు. స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం ఉన్నప్పటికీ, సొంత కౌన్సిలర్లను ఏకతాటిపై ఉంచలేకపోవడం రాజస్థాన్ బిజెపి నాయకత్వానికి తీవ్ర రాజకీయ పరాభవంగా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్