ప్రజాశక్తి – అచ్చుతాపురం: అచ్చుతాపురం జడ్పీటీసీ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా గంగిరెడ్డి నారాయణమ్మ గురువారం అనకాపల్లిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల పక్షాన నికరంగా పోరాడుతున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అచ్చుతాపురం మండలంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ముఖ్యంగా నిర్వాసితులు, రైతులు, కార్మికులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పరిశ్రమల కారణంగా ప్రభావితమైన నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా పరిషత్‌లో ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్.రాము, పార్టీ సీనియర్ నాయకులు కర్రీ అప్పారావు, పూడిమడక సీపీఎం నాయకులు పిట్ల మాణిక్యం, చాపల తాతయ్య, ఆర్.లక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం జడ్పిటిసి అభ్యర్థిగా గంగిరెడ్డి నారాయణమ్మ నామినేషన్
22 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 06:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)