సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పవన్ బాబూ.. మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపండి..

29 ఆగస్టు, 2026

Pawan Babu... please provide a permanent solution for drinking water.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 02:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రోలుగుంట (అనకాపల్లి) : ' పవన్ కల్యాణ్ బాబూ ... మా గ్రామంలో మంచినీటిని శాశ్వత పరిష్కారం చూపండి ` అంటూ ... శనివారం రోలుగుంట ఎస్ టి ఎస్సీ బీసీ మహిళలు ఖాళీ బిందెలు పట్టుకొని ఆందోళన చేపట్టారు. తమది ఫ్లోరైడ్ గ్రామం అని చెప్పారు. తమ గ్రామానికి మంచినీటిని ఇవ్వాలని నినదించిన వీడియో వైరల్ అవ్వడంతో డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ స్పందించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుండి ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. రోలుగుంట ఎస్సీ, ఎస్టీ బీసీ కాలనీకి తక్షణమే ఐదు లక్షల రూపాయల విలువ చేసే పనులు చేపట్టాలని ఆదేశించారు. దీనితో ప్రజా సంఘాలు, స్థానిక మహిళలు మాట్లాడుతూ ... డిప్యూటి సిఎం ఆదేశాల మేరకు జరిగే పనులకు తమ గ్రామంలో మంచినీటి సమస్య సగం మాత్రమే గట్టెక్కే అవకాశాలున్నాయని, శాశ్వత సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ ఆందోళనలో స్థానిక మహిళలు, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్