సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మా గిరిజన గ్రామానికి విబిజి గ్రాంజి పథకం పని ఇప్పించండి

18 ఆగస్టు, 2026

Please secure work for our tribal village under the VBG Gramji scheme.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 01:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కంచాల పట్టుకొని వినూత్నంగా ఆదివాసి గిరిజనులు ధర్నా


రావికమతం (అనకాపల్లి) : ' మా గిరిజన గ్రామానికి విబిజి గ్రాంజి పథకం పని ఇప్పించండి ` అంటూ .... మంగళవారం ఆదివాసి గిరిజనులు కంచాలను పట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా రావికత మండలం కొవ్వు గుంట పంచాయతీ పరిధిలో బుడ్డి బంద గిరిజన రెవిన్యూ గ్రామంలో 56 ఆదివాసి గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తమ గ్రామంలో పెద్దేరు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 181 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉందని, నీరు విడుదచేసి నేటికీ నెల రోజులవుతున్నా ... తమ పొలాలకు మాత్రం నీళ్లు రావడం లేదు అని గిరిజనులు వాపోయారు. పంటలు ఎండిపోయాయని, ఉపాధి పనిలేదు. ఏం తిని బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లేదా ఇతర గ్రామాలకు వలస పోయే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా .... వికాస్ భారత్ లక్ష్యంగా అందర్నీ అభివృద్ధి చేస్తామని కోట్లు రూపాయలు నిధులు కేటాయించామని ప్రకటన చేస్తున్నారు కానీ తమ గ్రామంలో నేటికీ ఉపాధి పని ఇవ్వకపోవడంతో పొట్ట చేతపట్టుకొని వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానిక అధికారులను పని అడిగితే... మీ గ్రామానికి విఆర్పి పోస్ట్ లేదు... అందువల్ల పని ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారని వివరించారు. తక్షణమే తమ గ్రామాలకు పని ఇవ్వాలని కంచాలు పట్టుకొని వినూత్నంగా కంచాల శబ్దంతో ప్రభుత్వం వినిపించాలని కోరుతూ ... తక్షణమే అధికారులు స్పందించి తమకు ఉపాధి పని కల్పించాలని, లేకపోతే సోమవారం నాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద తమ గ్రామస్తులు అందరిని కలిపి తట్టా పారా పట్టుకొని మండల కార్యాలయంలో పనులు నిర్వహిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే గోవిందరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ గిరిజన మహిళలు ఇతర పేద రైతులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్