బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఊరలోవ రెవెన్యూ సాగుదారుల ధర్నా

1 గంట క్రితం

Protest by Ooralova Revenue Cultivators
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 04:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

M/S అమర్ గ్రానైట్. పబ్లిక్ హిరీంగ్ రద్దు చేయాలి

ఊరల్లోవా రెవిన్యూ వ వెబ్ల్యాండ్ లో నమోదు చేయాలి.

సర్వే చేసి ఆరు నెలలు అవుతున్న పట్టాలు మాత్రం ఇవ్వలేదు.

కొమ్మరి సచివాలయం వద్ద ఊరలోవ రెవెన్యూ సాగుదారులు ధర్నా


రావికమతం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం. కోమిరి.కొవ్వుగుంట.బుడ్డి బంధ రెవెన్యూ గ్రామాలు ఆనుకొని వి.మాడుగులు మండలం ఉల్లావ రెవెన్యూ విస్తరించి ఉంది. ఉర్లావ కొండపై కలర్ గ్రానైట్. మరోవైపు జీడి మామిడి తోటలో 450 ఎకరాలు350 మంది లబ్ధిదారులు 2012-13 సంవత్సరంలో పట్టాలిచ్చారు. కానీ ఉల్లావ రెవిన్యూ వెబ్లాంట్ రికార్డులో నమోదు కాలేదు. దళితులకు గిరిజనులకు ఇతర పేదలకు ఇచ్చిన పట్టాలు వెబ్లాండ్ రికార్డులో లేవు. దీనివల్ల ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏమీ కూడా అందడం లేదు. మా భూములు వెబ్లాండ్ రికార్డులో నమోదు చేయాలని 26-9-2025 ఆందోళన చేయగా. అనకాపల్లి కలెక్టర్ గారు RC. No. 61362/2023/D3 Dt:27-9-2025 జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా. నర్సీపట్నం ఆర్డీవో. ఎడి మైన్స్. మాడుగులు తాసిల్దార్. ఏడి సర్వే గార్లను కమిటీగా ఏర్పాటు చేసి నెలరోజులు లాగ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. రెవిన్యూ అధికారులు వల్ల సాగుదారులకు సర్వే చేసి రిపోర్టు ఉన్నతాధికారులకు పంపించారు. నేటికీ ఆరు నెలలు అవుతున్న. నేటికీ పట్టాలు మాత్రం ఇవ్వలేదు. గ్రానైట్ క్వారీలకు మాత్రం. అనుమతులు ఇస్తున్నారు. ఊరలోవ రెవిన్యూ లో కలర్ గ్రానైట్ క్వారీలు ఇప్పటికే 9 క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీలు ప్రభావం వల్ల. కొవ్వుకుంట గ్రామ దేవత గుడి వెనక వైపు బీట్లవారింది. కొవ్వుకుంటా బుడ్డు బంధ గ్రామాల్లో ఉన్న ఇండ్లు వారి పోతున్నాయి. ఊరలోవ కొండపై సింగారపు గడ్డ. ఏనుగుల గడ్డ దూదే కల గడ్డలో మైనింగ్ కంపెనీలు కప్పి వేయడంతో కొమిరి రెవిన్యూ పరిధిలో సర్వేనెంబర్ 1-22.52-2.1-1.1-21. 12 ఎకరాలు మైనింగ్ వ్యర్ధాలన్నీ కప్పి వేయడం జరిగింది. ఈ విషయంపై2017 సంవత్సరంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్ విశాఖపట్నం వారికి. ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఇప్పటికే తెల్ల శుద్ధ అంతా పొలాల్లోకి రావడంతో పంటలు నష్టపోవడం జరుగుతుంది. రాత్రి అయితే కంటిమీద నిద్ర ఉండడం లేదు. గ్రానైట్ క్వారీలు వల్ల ఇబ్బంది పడేది కవ్వగుంట. బుడ్డి బంద కొమ్మరి గ్రామస్తులు. గ్రానైట్ క్వారీలు నుండి ఆదాయం V.j పురం గ్రామానికి చెందుతున్నాయి.


ఇదేం న్యాయం ...

గెలాక్సీ రాక్ గ్రానైట్ క్వారీ 2003 సంవత్సరంలో ప్రారంభమైంది. దీనితోపాటు అదనంగా 10 క్వారీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. క్వారీలు రాకముందు గ్రామసభల నిర్వహించినప్పుడు. మినరల్ వాటర్ ప్లాంట్ లో. రోడ్డు పక్కన చెట్లు. మెడికల్ క్యాంపులో. స్కూలు బిల్డింగులు. అభివృద్ధి కోసం సి ఎస్ ఆర్ గ్రాండ్స్. డిస్ట్రిక్ట్ మినరల్ పండు ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ లో. లేబర్ కి కనీస వేతనాలు. వంటి అంశాలపై హామీలు ఇస్తున్నారు. కొమిరి పంచాయతీ పరిధిలో ఎంపీపీ స్కూలు బిల్డింగు లేదు CSR. DFM నుండి నిధులు ఇవ్వండి అడిగిన కనీసం పట్టించుకోవడం లేదు. నేటికీ 23 సంవత్సరాలు కలర్ గ్రానైట్ రిక్షేపాలు కోర్టులో ఖనిజాన్ని తొలగించి వెళ్లిపోయారు. కొండ మొత్తం తీసుకొని పోయారు. కానీ వారి వల్ల నష్టపోతున్నటువంటి గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ E.E మరియు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు. ఊరలోవ కొండ రెవిన్యూని సందర్శించాలి. VJ పురం గ్రానైట్ పబ్లిక్ ఈ రింగ్ ని వెంటనే రద్దు చేయాలి. ఊరలోవ రెవిన్యూని వెబ్లాండ్ లో నమోదు చేసి. సర్వే చేసిన వారందరికీ పాస్ బుక్ ఇవ్వాలి. ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కే గోవిందరావు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు solam రాజు. సత్యవతి. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్