ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం రోలుగుంటలో మంచినీళ్లు ఇవ్వండి అంటూ ... చేతులు జోడించి వేడుకున్న మహిళలు
రోలుగుంట (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా రోలుగుంట కేంద్రంలో కాలనీలో దళితులు, గిరిజనులు, ఇతర పేద మహిళలు కలిసి ఖాళీ బిందెలతో మూడు వీధిలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయాలని కోరారు. CSR.DFM నిధుల నుండి వాటర్ ట్యాంకు ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. రోలుగుంట మండలంలో రోలుగుంటతోపాటు నిండుగొండ కే.నాయుడుపాలెం కొవ్వూరు.ఎన్ కొత్తూరు. అంట్లపాలెం రాజుపేట ముని పెళ్లి గొల్లపేట గ్రామాలను ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటికి 13000 మంది జనాభా రక్షత తాగునీరు అందించడానికి 2004 సంవత్సరంలో3 కోట్ల 50 లక్షల రూపాయలతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఈ నిధులతో జానకిరాంపురం గ్రామం వద్ద వరాహ నదిలో 3 భారీ బోరు బావులు తవ్వించారు. అక్కడినుండి రోలుగుంట లో లక్ష లీటర్లు సామర్థ్యం ఉన్న భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి పైప్లైన్ ద్వారా అందించారు. ఈ పథకం ప్రారంభించి కొద్ది రోజులు సక్రమంగా పనిచేసింది. ఇప్పుడు 20 వేల మంది జనాభా పెరిగారు. వరాహ నది బోరుబావుడు చుట్టూ ఇసుక మాఫియా తవ్వడంతో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. దీంతో గ్రామాలకు నీరు సరఫరా బంద్ అయిపోయింది. అమృత ధార ( జల్జీవన్ మిషన్)2020-21 ద్వారా ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులు పనులు చేపట్టకపోవడంతో కోటమ్మ ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది తిరిగి కూటమి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన అని చెప్పారు. అధికారులు చెబుతున్నారు. నేటికీ ఫ్లోరిడ్ గ్రామంగా గుర్తించి 23 సంవత్సరాలు అవుతుంది. పాత పైపులు పగిలిపోయాయి. అధికారులు అప్పులు చేసుకొని రిపేర్ చేస్తున్నారు. స్కీం మాత్రం కేటాయించడం లేదు. గ్రామంలో సొంత బోర్లు తీసుకున్న నీరు రావడం లేదు. కనీసం ఫ్లోరైడ్ నీరు కూడా దొరకడం లేదు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ప్రతి గ్రామానికి రక్షత మంచినీరు సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలో చెప్తున్నారు. కనీసం మండల కేంద్రంలో నీరు సరఫరా చేయకపోవడం చాలా అన్యాయం. 12 కుటుంబాల వారు సొంతంగా బోరు తీసుకోవడం జరిగింది. నీరు పడలేదు లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి నీరు రావడం లేదు. దళిత గిరిజన ఇతర పేద వీధులన్నిటికీ వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రోలుగుంట నిండుగొండ. కొవ్వూరు రెవిన్యూ పరిధిలో 12 నల్లరాయి క్వారీలు. ఉన్నాయి. పర్యావరణ అనుమతులు గ్రామసభలు పెట్టేటప్పుడు గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుతాం. మెడికల్ క్యాంప్ పెడతాం సభలో ప్రకటిస్తున్నారు. 20 సంవత్సరాల నుండి ఖాళీ కరాప నిర్వహిస్తున్నారు సి ఎస్ ఆర్ Csr. డిస్ట్రిక్ట్ పండు నిధులు రోలుగుంట మంచినీరికి కేటాయించకపోవడం చాలా అన్యాయం. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ జై గారితో ఫోన్లో మాట్లాడగా, వరాహ నదిలో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. నీరు లేదు. చెప్పారు. తక్షణమే దళిత గిరిజన కాలనీకి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు, v.నూకరత్నం, v.శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)