శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పదేపదే అదాని మనుషుల సర్వే - మళ్లీ అడ్డుకున్న గిరిజనులు

26 అక్టోబర్, 2026

Repeated surveys by Adani’s associates – Tribals intervene and stop them again
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దేవరాపల్లి (అనకాపల్లి) : దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ నగరం పాలెం వద్ద సోమవారం అదాని హైడ్రో పవర్ ప్లాంట్ సర్వేకు వచ్చిన అదాని మనుషులను సోమవారం ఆదివాసీ గిరిజనులు అడ్డుకుని తిరిగి పంపించేశారు. ఇప్పటికే పలు మార్లు సర్వే కోసం మట్టి పరీక్షల కోసం వచ్చిన వారిని అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికి పదే పదే గిరిజనులను భయబ్రాంతులకు గురిచేస్తూ అదాని మనుషులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న తీవ్రంగా ఖండించారు. దట్టమైన అటవి ప్రాంతంలో గిరిజనులు ఆదివాసీలు నివాసం ఉన్న ప్రాంతంలో అదాని హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేయడం దుర్మార్గపు చర్యని అన్నారు. సర్వేల పేరుతో గిరిజనులను వేధింపులకు గురి చేయడం బెదిరింపులకు దిగడం వంటి చర్యలకు పూనుకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ పవర్ ప్లాంట్ వల్ల కోనాం ప్రాజెక్టుకు తీవ్రమైన నష్టం జరగడంతోపాటు చుట్టుపక్కల గిరిజనుల జీవన విధానానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలిపారు. బోడ్డగుమ్మి గెడ్డపై పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగితే కోణాం రిజర్వేయరుకు కేచ్ మేంటు ఏరియాగా ఉన్న గెడ్డలు ఎండిపోతాయని వివరించారు. కోణం ప్రాజెక్టుకు జీవనది గా ఉన్న బోడ్డగుమ్మి గెడ్డ పూర్తిగా ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు ఈ ప్రాంతంలో ఎటువంటి పవర్ ప్లాంట్ నిర్మాణం జరగకుండా గిరిజనులు ఆదివాసీలకు నష్టం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామాక్రిష్ణ, రవి, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్