శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు

22 అక్టోబర్, 2026

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే 
సిపిఎం అభ్యర్థులను గెలిపించండి 
ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు
ఐదు మండలాల జెడ్‌‌పిటిసి అభ్యర్థుల నామినేషన్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 06:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి -అనకాపల్లి​

​‌నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను జెడ్‌‌పిటిసిలుగా గెలిపించాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఐదు మండలాలకు చెందిన సిపిఎం జెడ్‌‌పిటిసి అభ్యర్థులు నామినేషన్‌ ‌పత్రాలను దాఖలు చేశారు. అచ్యుతాపురం జెడ్‌‌పిటిసి సిపిఎం అభ్యర్థిగా గంగిరెడ్డి నారాయణమ్మ, రాంబిల్లి మండలం నుంచి మైలపల్లి లక్ష్మి, నక్కపల్లి మండలం నుంచి యాదగిరి నవీన్, రోలుగుంట మండలం నుంచి ఈర్లె చిరంజీవి, గొలుగొండ మండలం నుంచి సెగ్గె పురుషోత్తం నామినేషన్లు వేశారు.


ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో భూసమస్యలు, పరిశ్రమల పేరుతో భూములు కోల్పోతున్న రైతులు, పేదలు, నిర్వాసితుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వారికి న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని, ఇళ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు మంజూరు చేయాలని సిపిఎం నిరంతరం పోరాడుతోందని తెలిపారు


గిరిజన ప్రాంతాల్లో భూమి, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, పరిశ్రమల్లో కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పోరాడుతోందన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, మత్స్యకారులు, ఇతర శ్రామిక ప్రజలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోన్న సిపిఎం సభ్యులను జిల్లా పరిషత్‌ కౌన్సిల్‌‌కు పంపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.


ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికలు కేవలం పదవుల కోసం కావని, ప్రజల హక్కులు, సమస్యల పరిష్కారం, స్థానిక అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలని కోటేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పట్టించుకోని నాయకులకు బదులుగా, ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములై, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్ధులను ఎన్నుకోవాలని కోరారు. భూ సమస్యలు, నిర్వాసితుల ఇబ్బందులు, గిరిజనుల హక్కులు, కార్మికుల సమస్యలపై పోరాటాలను మరింత బలోపేతం చేయడానికి ఐదు మండలాల్లో పోటీ చేస్తున్న సిపిఎం జెడ్‌‌పిటిసిఅభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.రాము, వి.వి.శ్రీనివాసరావు, డి.డి.వరలక్ష్మి, సిపిఎం నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు కర్రి అప్పారావు, నాయకులు పి.మాణిక్యం, కె.ఈశ్వరరావు, పాంగి చలపతి, సాపిరెడ్డి నాయరాయణమూర్తి పాల్గొన్నారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్