సత్తెనపల్లి రూరల్ (గుంటూరు) : ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ఘటనలో యువ న్యాయవాది మృతి చెందాడు. ఈ సంఘటన సత్తెనపల్లి మండలం మురళీ నగర్ సమీపంలో శుక్రవారం జరిగింది. మాచర్ల నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సును గుంటూరు వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువ న్యాయవాది అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో యువ న్యాయవాది మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)