శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

150 పిజ్జాలు, రూ. 75 వేలు : జంతర్‌ మంతర్‌లో పరిమళించిన మానవత్వం

1 గంట క్రితం

150 Pizzas, Rs. 75,000: Humanity's Fragrance at Jantar Mantar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 04:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నాగాలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన సహాయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, నిరసనకారుల పట్ల తన సంఘీభావాన్ని వినూత్నంగా చాటుతూ ఆయన 150 పిజ్జాలను పంపించడం విశేషంగా నిలిచింది.


నాగాలాండ్‌కు చెందిన ఝా-లౌ (Zha-Lhou) తన స్వస్థలం నుంచే డామినోస్ యాప్ ద్వారా జంతర్ మంతర్ వద్దకు 150 "చీజ్ బర్స్ట్" పిజ్జాలను ఆర్డర్ చేశారు. జూలై 22న కొరియన్ స్వీట్ చిల్లీ, ఫార్మ్‌హౌస్ రకాల పిజ్జాల కోసం ఆయన రూ.67,734.18 ఖర్చు చేశారు. అనంతరం విద్యార్థుల కోసం మరో రూ.5,000 విలువైన బిస్కెట్లను కూడా పంపించారు. పిజ్జాలు తీసుకొచ్చిన డెలివరీ సిబ్బంది ఫోన్ చేసి, ఈ ఆర్డర్ ఎవరికి అందజేయాలని అడగగా, "అక్కడ ఇంకా భోజనం చేయకుండా ఆకలితో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వండి" అని ఝా-లౌ సూచించారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ (@adiespoems) ఖాతా ద్వారా పంచుకోవడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. "నేను నాగాలాండ్‌లో ఉన్నాను. కానీ మంచి భవిష్యత్తు, న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్నారు. నేను ప్రత్యక్షంగా అక్కడ ఉండలేకపోయినా, నా వంతుగా చేయగలిగిన చిన్న సహాయం ఇదే" అని ఆయన పోస్టులో పేర్కొన్నారు. తన చర్యకు ప్రశంసలు పొందడమే ఉద్దేశం కాదని, ఇతరులు కూడా తమకు చేతనైన విధంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అండగా నిలవాలనే సందేశంతోనే ఈ విషయాన్ని పంచుకున్నానని ఝా-లౌ స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థుల కోసం మరోసారి రూ.5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేసినట్లు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్