సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యువకుడు ఆత్మహత్య ..

16 గంటల క్రితం

A young man commits suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 12:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రేమ వ్యవహారం.. పెళ్లి విషయమై ఒత్తిడి ?

“నా చావుకు ఎవరూ కారణం కాదు” అంటూ వీడియో..


రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. రాయదుర్గం పోలీస్ ఇన్స్పెక్టర్ దేవానంద్ తెలిపిన వివరాల ప్రకారం .... పట్టణ పొలిమేరలోని మల్లాపురం లేఅవుట్‌లోని 17వ నంబర్ ఇంట్లో నివాసం ఉంటున్న మంజు అనే యువకుడు ఆదివారం రాత్రి సుమారు గంటలు11 గంటల 30 నిమిషాలకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు “నా చావుకు ఎవరూ కారణం కాదు” అంటూ వీడియోను రికార్డు చేసి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మంజు ఓ యువతిని ప్రేమిస్తున్నాడని, ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే పెళ్లి విషయమై యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని తెలుస్తోంది. మరోవైపు తనకు పెళ్లి చేయాలని మంజు తల్లి పై కూడా ఒత్తిడి తెస్తుండేవాడని, ప్రస్తుతం ఎలాంటి పని చేయకుండా ఉంటే ఎలా పెళ్లి చేయాలని ఆమె చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి మంజు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీస్ ఇన్స్పెక్టర్ దేవానంద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్