శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎల్ నినో....

48 నిమిషాల క్రితం

El Niño ...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 03:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎల్ నినో పాపం ఎవ్వరిది...?

మదమెక్కి కొట్టుకుంటున్న

బలిసిన దేశాల బరితెగింపే...

ఈ విపత్తుకు అసలు కారణం..!

సహజ వనరుల్ని కొల్లగొట్టి

ప్రకృతి వొళ్లంతా గుల్ల చేసిన

మీ లాభాల యావ చేసిన

గాయాలు కాక మరేమిటి...?

కోరలు చాచిన కాలుష్యాన్ని,

జనావాస గుమ్మాల్లో కుప్పలు

తెప్పలుగా కుమ్మరించిన

మీ అరాచకానికి గుర్తులే కదా...!

ఈ కరువు కాటక విపత్తులు

మండుతున్న వేసవి తాపాలు

ముంచుతున్న వరద విలాపాలు

మీ అత్యాశకు ఆనవాళ్లు.

ప్రపంచీకరణ యుగంలో...

ప్రపంచం నేడొక కుగ్రామం

అని కదా...! మీ ప్రచారం

లాభాలను నొల్లుకోడానికే

కాదు, నష్టాలను

పంచుకోడానికి కూడా

వర్తిస్తుంది ప్రపంచీకరణ సూత్రం

కోరలు చాచిన కరువు

ఏదో ఒక ప్రాంతానికో

లేక దేశానికో మాత్రమే

కాదు పరిమితం.

వాతావరణ విపత్తులకు

సరిహద్దులు వుండనట్టే ...!

ఆపన్నుల ఆకలి కేకలుకు

వుండవు ఏ హద్దులు

ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ...

ప్రకృతి వనరులు స్వాహా చేస్తూ...

ఆపన్నుల ఆర్తి విననంటే...!

ఆదుకొనే బాధ్యత లేదంటే...!

వల్లదు లోకం ఎంతమాత్రం.

-వి. రాజగోపాల్,

సెల్‌: 9133084262, విజయనగరం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్