- అక్టోబర్ 14లోగా దరఖాస్తు చేసుకోవాలి
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-అనంతపురం : 2026–27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ కళాశాలల్లో నిర్వహించే పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్, రేడియేషన్, లేబొరేటరీ, మెడికల్ ఇమేజింగ్, రేడియోగ్రఫీ, ఆప్తాల్మిక్, కార్డియాలజీ, పెర్ఫ్యూషన్, క్యాథ్ ల్యాబ్, డయాలసిస్ టెక్నాలజీ తదితర విభాగాల్లో డిప్లొమా కోర్సులతో పాటు పురుష ఆరోగ్య కార్యకర్తల శిక్షణ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
అర్హతలు, దరఖాస్తు విధానం
17 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. సంబంధిత కోర్సులకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు www.apsahpc.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు పొందాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 14వ తేదీలోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి సమర్పించాలన్నారు.
ప్రవేశాల్లో ప్రభుత్వ కోటా 60 శాతం, మేనేజ్‌మెంట్ కోటా 40 శాతం ఉంటాయని తెలిపారు. అడ్మిషన్ కమిటీ ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి, ఈ నెల 31వ తేదీలోగా జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లోని సూచనలు, నిబంధనలను పూర్తిగా పరిశీలించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు కోరారు.







కామెంట్‌లు (0)