-మెటీరియల్ పంపిణీలో అధికారులు
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల విధులకు సిబ్బంది హాజరయ్యారు. ఈనెల ఐదున అంటే బుధవారం పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు స్థానిక జెఎంజె మహిళ కళాశాలలో మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి సిబ్బంది వివరాలను మైక్ ద్వారా అనౌన్స్ చేస్తూ హాజరు నమోదు చేసుకున్నారు. పోలింగ్ స్టేషన్లో వారీగా మెటీరియల్ను పంపిణీ సిద్ధం చేశారు. మెటీరియల్ స్వాధీనం చేసుకున్న ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్స్, ఆదర్ పోలింగ్ ఆఫీసర్స్ మెటీరియల్ను సరి చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం కి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సులలో పోలింగ్ స్టేషన్లకు సిబ్బందిని చేరుస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి దుర్గాబాయి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అత్తోట దీప్తి, కె.వి గోపాలకృష్ణ, రూట్ ఆఫీసర్లు, జోనర్ అధికారులు మెటీరియల్ పంపిణీ ప్రక్రియను పరిశీలిస్తున్నారు.







కామెంట్లు (0)