మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరుపయోగంగా డంపింగ్ యార్డ్స్

6 రోజుల క్రితం

spore
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 01:16 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – ఆత్మకూరు : చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలు అనేక చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల అరకొర సంపదకే పరిమితమవుతున్నాయి. దీంతో పల్లెల్లో ఎక్కడబడితే అక్కడ చెత్త ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ కేంద్రాలు అక్కరకు రాకపోవడంతో ఊరి చివరన చెత్తను పోగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గత సర్కారు హయాంలో నిర్లక్ష్యానికి గురైన వీటిని కూటమి ప్రభుత్వమైనా గాడిలో పెట్టాలనే డిమాండ్లు గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండల వ్యాప్తంగా 17గ్రామ పంచాయతీలు అన్ని పంచాయతీల్లో రోజుకి సుమారు 16 టన్నులు ప్లాస్టిక్‌, కాగితాలు వంటివి పొడి చెత్త, 16టన్నుల వరకూ తడి చెత్త, మరో 10 టన్నుల మేర హానికరమైన వ్యర్థాల ఉత్పత్తి జరుగుతోందని పంచాయతీ అధికారులు లెక్కలు చెబుతున్నాయి. మండలం లో సుమారు 17 గ్రామాలకు చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలు ఉండగా మిగిలిన కేంద్రాలు నిర్మాణం జరగాల్సి ఉంది. సుమారు 16 కేంద్రాల్లో చెత్త నుంచి సంపద తయారు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో అనేక కేంద్రాలలో సంపద తయారీ అరకొరగానే సాగుతోంది. కొన్ని కేంద్రాల్లో అప్పుడప్పుడూ సంపదను తయారు చేస్తున్నప్పటికీ కొనేవారు ముందుకు రావడం లేదు. చాలా కేంద్రాలు తూతూ మంత్రంగా కొంత చెత్తను పోగు చేసి సంపద సృష్టిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు గ్రామపంచాయతీలు చెత్తను గ్రామాల శివార్లలో డంపింగ్‌ చేస్తున్నారు. దీని వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. నెలలో ఒకటి రెండుసార్లు చెత్తను తగలబెడుతుండటం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.కానరాని అధికారుల పర్యవేక్షణగ్రామాల్లో రోజూ గ్రీన్‌ అంబాసిడర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించిన తడి, పొడి చెత్తతో పాటు వీధుల్లో పేరుకు పోయిన చెత్తను రిక్షాల ద్వారా ఈ కేంద్రాలకు తరలించాలి. అక్కడ తడి, పొడి చెత్తను వేర్వేరుగా కుండీల్లో వేసి వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయించడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను స్క్రాప్‌ దుకాణాలకు విక్రయించి పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ఈ కేంద్రాల లక్ష్యం. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతున్న నేపథ్యంలో ఈ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో అనేక సంపద కేంద్రాలు అలంకారప్రాయంగా మరాయన్న విమర్శలు గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర అమలు అరకొరేనా…స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు సక్రమంగా అమలు కావడం లేదు. ఈ కార్యక్రమాలకు మొదట్లో కొన్ని నిధులు విడుదల అయినప్పటికీ ఆ తర్వాత కాలం నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. తూతూ మంత్రంగా మాత్రమే ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఆర్థిక సంఘాల నిధులు ఖర్చుపై ఆంక్షలు విధించడం, ఉన్న కాస్త సాధారణ నిధులు అభివద్ధి పనులకు సైతం సరిపోకపోవడం వంటి అనేక కారణాల వలన పల్లెలో పారిశుధ్యం బాగా క్షీణిస్తుంది.అధ్వానంగా పారిశుధ్యంపలు పంచాయతీల్లో పారిశుధ్యం పూర్తిగా క్షీణిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. శివారు గ్రామాల్లో పారిశుధ్య పనులు అసలు జరగడం లేదని స్థానికులు విలపిస్తున్నారు. ఆత్మకూరు ముట్టల పి యలేరు తలపూరు వద్దిపల్లి సానప గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రోగాల బారిన ప్రజలుచెత్తను సంపద కేంద్రాలకు తరలించకపోవడం, పూర్తి స్థాయిలో పారిశుధ్య పనులు నిర్వహించుకోవడం, నిధుల కొరత వంటి పలు కారణాల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చెత్త నుంచి సంపద తయారు చేసే విధంగా పలు పంచాయతీల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ నిరుపయోగంగా మారాయి. రూ.కోట్లలో ఖర్చు చేసి వీటిని నిర్మించినా అక్కరకు రాకుండా పోతున్నాయి. దీంతో రోగాలతో సహవాసం చేయాల్సి వస్తుందని పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలతో ప్రయివేటు వైద్యం చేయించుకోలేక ఆర్థిక అవస్థలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. దీనిపై తక్షణం స్పందించి అధికారులు చెత్త నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి ప్రజలు రోగాలు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్