శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన ఎన్నికలు.. కాయ్ రాజా కాయ్ పందాలు

1 గంట క్రితం

Elections conclude bets are placed on the outcome
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 11:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పలతోపాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. శనివారం జిల్లా కేంద్రమైన అనంతపురం జేఎన్టీయూ కళాశాలలో జడ్పిటిసి ఎంపిటిసి ఓట్ల లెక్కింపు జరుగుతుంది నార్పల మండలంలో సుమారు 74% పోలింగ్ జరిగింది మండల వ్యాప్తంగా 47 వేల 116 మంది ఓటర్లు ఉండగా 34 వేల 888 ఓట్లు పోలయ్యాయి బరిలో దిగిన అన్ని పార్టీల అభ్యర్థులందరూ విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీంతో మండల కేంద్రమైన నార్పల తోపాటు పలు గ్రామాల్లో పలు పార్టీల అభ్యర్థుల జయ అపజయాలపై జోరుగా పందాలు సాగుతున్నాయని అదేవిధంగా ఎంపీపీ పదవి ఎవరికి దక్కుతుంది అని ఒకటికి రెండు కాయ రాజా కాయంతో పందాలు కాస్తున్నారని మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగిపోయింది మరి కొందరైతే ఏకంగా ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది అన్న దానిపై కూడా పందాలు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా నార్పల మండల వ్యాప్తంగా లక్షలాది రూపాయలు బెట్టింగ్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.. మండల వ్యాప్తంగా వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయోనని పలువురు మండల ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్