శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొయ్యలగూడెం మండలంలో 72.12 శాతం పోలింగ్

1 గంట క్రితం

7212 percent polling in Koyyalagudem mandal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 12:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- 64 పోలింగ్ కేంద్రాల్లో 43,251 ఓట్లు నమోదు

- 59,974 మంది ఓటర్లకు గాను ఓటు హక్కు వినియోగించుకున్న 43,251 మంది

- పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికం.. పోలింగ్‌లో మాత్రం పురుషులదే పైచేయి

- మంగపతిదేవిపేటలో అత్యధికం.. పరింపూడి-3లో అత్యల్పం


ప్రజాశక్తి-కొయ్యలగూడెం (ఏలూరు) : మండలంలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 72.12 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలోని 64 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 59,974 మంది ఓటర్లు ఉండగా, వారిలో 43,251 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీటీసీ వారీగా విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి.


మండలంలో మొత్తం 29,380 మంది పురుష ఓటర్లు ఉండగా, వారిలో 21,763 మంది ఓటు వేశారు. అలాగే 30,593 మంది మహిళా ఓటర్లకు గాను 21,488 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతర ఓటర్లు ఒకరు ఉన్నారు. పురుషుల పోలింగ్ శాతం 74.07 కాగా, మహిళల పోలింగ్ శాతం 70.24గా నమోదైంది.


సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే రామానుజపురంలో 3,751 మంది ఓటర్లకు గాను 3,107 ఓట్లు పోలై 82.83 శాతం, సీతంపేటలో 2,537 మందికి గాను 2,165 ఓట్లు పోలై 85.34 శాతం నమోదైంది. బయ్యనగూడెం-1లో 2,436 మందికి గాను 1,619 ఓట్లు పోలై 66.46 శాతం, బయ్యనగూడెం-2లో 2,438 మందికి గాను 1,737 ఓట్లు పోలై 71.25 శాతం నమోదైంది. ఈ రెండు సెగ్మెంట్లలో ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించారు.


సరేపల్లిలో 3,311 మందికి గాను 2,521 ఓట్లు పోలై 76.14 శాతం, దిప్పకాయలపాడులో 4,022 మందికి గాను 2,900 ఓట్లు పోలై 72.10 శాతం, కన్నాపురం-1లో 2,275 మందికి గాను 1,599 ఓట్లు పోలై 70.29 శాతం, కన్నాపురం-2లో 2,285 మందికి గాను 1,560 ఓట్లు పోలై 68.27 శాతం పోలింగ్ నమోదైంది.


మంగపతిదేవిపేటలో 1,795 మందికి గాను 1,599 ఓట్లు పోలై 89.08 శాతంతో మండలంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. బోడిగూడెంలో 3,772 మందికి గాను 2,966 ఓట్లు పోలై 78.63 శాతం, అచ్చుతాపురంలో 1,956 మందికి గాను 1,635 ఓట్లు పోలై 83.59 శాతం నమోదైంది.


పరింపూడి సెగ్మెంట్లలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. పరింపూడి-1లో 2,940 మందికి గాను 1,635 ఓట్లు పోలై 55.61 శాతం, పరింపూడి-2లో 1,570 ఓట్లు పోలై 53.40 శాతం, పరింపూడి-3లో 1,405 ఓట్లు పోలై 47.79 శాతం, పరింపూడి-4లో 1,600 ఓట్లు పోలై 54.18 శాతం నమోదైంది.


గవరవరం-1లో 2,142 మందికి గాను 1,744 ఓట్లు పోలై 81.42 శాతం, గవరవరం-2 (చొప్పరామన్నగూడెం)లో 2,147 మందికి గాను 1,652 ఓట్లు పోలై 76.94 శాతం నమోదైంది. ఎర్రంపేట-1లో 2,862 మందికి గాను 2,091 ఓట్లు పోలై 73.06 శాతం, ఎర్రంపేట-2 (కుంతలగూడెం)లో 1,956 మందికి గాను 1,576 ఓట్లు పోలై 80.57 శాతం నమోదైంది.


పొంగుటూరులో 3,376 మందికి గాను 2,595 ఓట్లు పోలై 76.87 శాతం, రాజవరం-1లో 2,569 మందికి గాను 1,973 ఓట్లు పోలై 76.80 శాతం, రాజవరం-2లో 2,571 మందికి గాను 2,002 ఓట్లు పోలై 77.87 శాతం పోలింగ్ నమోదైంది.


మొత్తంగా మండలంలో మంగపతిదేవిపేట అత్యధిక పోలింగ్‌తో మొదటి స్థానంలో నిలవగా, పరింపూడి-3 అత్యల్ప పోలింగ్‌తో చివరి స్థానంలో నిలిచింది. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఓటు హక్కు వినియోగించుకోవడంలో పురుషుల పోలింగ్ శాతమే అధికంగా నమోదైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్