శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అన్నమాచార్య ఫార్మసీ కళాశాల సహ ఆచార్యులకు డాక్టరేట్ ప్రదానం

1 గంట క్రితం

Doctorate awarded to Associate Professor at Annamacharya College of Pharmacy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 01:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజంపేట (కడప) : స్థానిక అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో ఫార్మసీ కళాశాలలో సహ ఆచార్యులుగా సేవలందిస్తున్న డాక్టర్ డి.గిరి రాజ శేఖర్ కు డాక్టరేట్ ప్రదానం చేశారు. డాక్టర్ డి.గిరి రాజశేఖర్ వేల్స్ విశ్వవిద్యాలయం, చెన్నైలో సుమారు ఏడు సంవత్సరాలపాటు తన పరిశోధనను వేల్స్ విశ్వవిద్యాలయం రీసర్చ్ స్కాలర్ గా చేసి ఇటీవల డాక్టరేట్ ప్రదానం పొందారని ఫార్మసీ కళాశాల డీన్ డాక్టర్ డి.స్వర్ణలత తెలిపారు. ఔషధ వినియోగంలో భద్రత, రోగులకు సరైన ఔషధ సమాచారం అందించడంలో క్లినికల్ ఫార్మసిస్ట్ పాత్ర అను అంశంపై సుమారు ఏడు సంవత్సరాలు పరిశోధన చేసినందుకు వేల్స్ విశ్వవిద్యాలయం వారు తన పరిశోధనలు గుర్తించి పీ.హెచ్.డి ప్రదానం చేశారు. డాక్టర్ డి.గిరి రాజశేఖర్ సుమారు 14 సంవత్సరాల నుండి అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో సేవలందిస్తున్నారు. వీరి విద్యా అర్హత, అభివృద్ధిని గుర్తిస్తూ అన్నమాచార్య విశ్వవిద్యాలయం ప్రో ఛాన్స్లర్ సి.అభిషేక్ రెడ్డి, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ ఈ.సాయి బాబా రెడ్డి అభినందించారు. విశ్వవిద్యాలయం చాన్సులర్ డాక్టర్ సి.గంగ రెడ్డి, వైస్ చైర్మన్ సి.ఎల్లా రెడ్డి గిరి రాజశేఖర్ ను ప్రశంసించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్