బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారంటూ ... మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ధర్నా

18 నిమిషాల క్రితం

Former Minister Usha Sree Charan stages a protest, alleging that nomination papers were snatched away.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 01:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పెనుకొండ టౌన్ (అనంతపురం) : పెనుకొండ మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కురుబవాండ్లపల్లి ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వస్తుండగా ఓబుళప్ప చేతుల్లో వున్న నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు లాక్కెల్లారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆరోపించారు. ఈ సందర్బంగా బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆమె వైసీపీ శ్రేణులతో కలసి ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డిఏవో రంగనాయకులను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి, నాయకులు పొగాకు రామచంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
011


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్